ఆంధ్ర దేశ చరిత్ర ఇక్ష్వాకులు

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0

After Satavahana Kings Ekshvaku Dynasty ruled the region around Nagarjuna Hill. Nagarjuna Hill was theri capital. Ekshvaku kings ruled from 220 A.D. – 295 A.D.

Though Puranas mentioned 7 Eksvaku Kings evidences were there only for four kings in their inscriptions.

Nagarjuna Konda, Amaravathi, Jaggayya Peta and Ramreddy Palli inscritions are evidences for their period. Though they ruled only for a brief period of 75 years, they laid a firm foundation for the flourishing of culture in Andhra.

శాతవాహనుల అనంతరం నాగార్జునకొండ కేంద్రంగా ఈక్ష్వాకులు అధికారంలోకి వచ్చారు. క్రీస్తు శకం 220 నుండి 295 వరకు దాదాపు 75 సంవత్సరాలు పాలించారు. పురాణములలో ఏడుగురు ఇక్ష్వాకులు ప్రస్తావించబడినప్పటికీ శాసనాలు మాత్రం నలుగురి గురించి మాత్రమే ప్రస్తావించాయి. వీరి చరిత్రను తెలియజేసే ఆధారాలు నాగార్జున కొండ, అమరావతి, జగ్గయ్యపేట మరియు రాంరెడ్డి పల్లి వద్ద లభ్యమైన శాసనాలను బట్టి తెలుస్తున్నది. కేవలం 75 సంవత్సరాలు మాత్రమే పాలించిప్పటికీ ఆంధ్రదేశంలో సాంస్కృతికి వికాసానికి ఇక్ష్వాకులు గొప్ప పునాదిని వేసారు. వీరికాలంనాటి సాంస్కృతికి వికాసాన్ని తెలుసుకొనేముందు వీరి యుగ ప్రాముఖ్యతను, విశిష్టతను గుర్తించవలసి ఉంటుంది.

ఇక్ష్వాకులు – యుగ ప్రాముఖ్యత

1. మత పరంగా ఇక్ష్వాక రాజులు వైదిక మతాన్ని, బ్రాహ్మణ మతాన్ని ఆచరించక ఇక్ష్వాకులు రాణులు బౌధ్ద మతాన్ని ఆదరించారు. బ్రాహ్మణ మతం , బౌద్దమతం రెండు కూడా ఆదరించబడ్డాయని తెలుస్తుంది.

2. పాలనా వ్యవస్దలో చక్రవర్తి కొరకు ప్రాణాలర్పించే వీరులు అనే అంగరక్షకులు ఏర్పడటం ఇక్ష్వాకుల కాలంనుండే ప్రారంభం.

3. ప్రభువు కొరకు ప్రాణాలర్పించే వీరుల విగ్రహాలను ప్రతిష్టించే సాంప్రదాయం ౟౟ వీరగల్లు సాంప్రదాయం ప్రారంభం.

4. వాస్తుపరంగా దేవాలయనిర్మాణం భారతదేశంలోనే మొదటిసారిగా ప్రారంభం. దక్షిణ భారతదేశ నిర్మాణ శైలి అయిన ద్రవిడశైలి వీరికాలం నుండే ప్రారంభించబడింది.
5. కట్టడాలు , నిర్మాణాలపై శిల్పుల పేర్లు చెక్కే సాంప్రదాయం ప్రారంభం.
6. శిల్పరంగంలో అమరావతీ శిల్ప సాంప్రదాయం అత్యున్నత దశకు చేరుకుంది.
పై కారణాలన్నీ ఆంధ్రుల చరిత్రలో సాంస్కృతిక వికాసానికి ముఖ్యమైన పునాదులు ఇక్ష్వాకుల కాలంలోనే పడ్డాయి.

నాటి వికాసం మతం భాషా సాహిత్యం వాస్తు, శిల్పరంగాల్లో ప్రతిభింబించబడుతుంది.

మతపరంగా బ్రాహ్మణమతం , బౌధ్దమతం సమాంతరంగా వృద్ది చెందాయి. ఇక్ష్వాక రాజులలో వీరపురుషదత్తుడిని తప్ప మిగిలినవారంతా బ్రాహ్మణ మతాన్ని ఆదరించారు. ఇక్ష్వాకు వంశ స్ధాపకుడైన శ్రీశాంత మూలుడు బ్రాహ్మణులను ఆహ్వానించి భారీగా దానములిచ్చి రాజసూయ, అశ్వమేధం వంటి యాగాలను నిర్వహించారు. ఎహువల శాంతమూలుడు బ్రాహ్మణ మతంలోని ముఖ్యమైన దేవుళ్ళందరికీ ఆలయాల్ని కట్టించాడు.
Ikshvaku Kingdom
Class notes of Sayeed Sir useful for APPSC and TSPSC Exams
saeed-ap-history-1501500021 saeed-ap-history-1501500022 saeed-ap-history-1501500023 saeed-ap-history-1501500024 saeed-ap-history-1501500025 saeed-ap-history-1501500026

ఆంధ్ర దేశ చరిత్ర ఇక్ష్వాకులు గ్రూప్ స్టడీ మెటీరియల్
Group 1 Study Material
Andhra History – Ekshwaku kings

గ్రూప్ స్టడీ మెటీరియల్