Ayurvedic treatment disease diagnosis medicine diet

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0

Dr S anjaneyulu ayurvedic doctor in amberpet hyderabadఆయుర్వేద వైధ్యం – ఆహారం – పథ్యం

ఆయుర్వేద చికిత్సలో పథ్యం – అపథ్యం ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఆహార పదార్ధాలకు వ్యాధిని పెంచే గుణం ఉంటుంది. కాబట్టి వాటిని తీసుకోవద్దు. మరికొన్ని ఆహార పదార్ధాలకు వ్యాధిని తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి వాటిని తీసుకోవచ్చని వైధ్యులు సూచిస్తారు.
ఏ విధానం ద్వారా వ్యాధి తగ్గుతుందో దానిని చికిత్స అంటారు. చికిత్స గురించి ఆయుర్వేదంలో వివరంగా తెలుపబడింది. ఏ విధానం ద్వారా వ్యాధి కలుగుతుందో / పెరుగుతుందో అది వ్యాధి కారకం అవుతుంది అని ఆయుర్వేద మహర్షులు తెలియజేసారు.  ప్రతి ఆహారం రక్తం, మూత్రం లో మార్పును తీసుకువస్తుంది. అందుకే రక్త, మూత్ర పరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్ధారించుకుని ఔషధాలు వాడుతుంటారు. ఇలా ఔషదాలు వాడే సమయంలో అన్ని రకాల ఆహార పదార్ధాలు వాడటం వల్ల తప్పు జరిగి వ్యాధి తగ్గకపోవడం జరుగుతుంది. ఉదాహరణకు జలుబు ఔషదాన్ని వాడేటప్పుడు ఒకవైపు మనం తీసుకునే ఔషధానికి జలుబు ను తగ్గించే గుణం ఉంటే మనం తీసుకునే ఆహారంలో జలుబును పెంచే పదార్ధాలు ఉంటే రోగి జలుబు పెరుగుతుంది. కొన్నిసార్లు ఈ ప్రభావం వెంటనే కనబడకపోయినా తర్వాత కనపడుతుంది. అది ఆస్తమాకు దారితీయవచ్చు.

Ayurvedic Treatment – Food and Prescribed and Proscribed diet

During the Ayurvedic treatment doctor prescribe some food items and proscribes some. It is only because some food items have the nature of aggravating some diseases and some pacify the diseases. Treatment means the way of pacifying the disease. The treatment for various diseases has been described in Ayurveda very clearly. Ayurvedic sages have described clearly about the causes of various diseases. Every food item we take will have effect on our blood and urine. That is the reason doctors advice the blood and urine tests and treat the patients according to the reports. During the course of treatment due to some food items we take some diseases get aggravated. For example when one is suffering from cold and using medicine for it, if any of the food items he consumes has the nature of increasing cold his cold will not be cured that easily. On some occasions the negative effect may not show its impact immediately but in no time it will show the adverse effects.

ఆయుర్వేదం ప్రకారం వ్యాధి నిర్ధారణ – చికిత్స – Diagnosis and Treatment in Ayurveda

కొన్నిసందర్భాలలో ల్యాబ్ వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో ఎవిధమైన అంకెలు మారకుండా సాధారణ రిపోర్టు వచ్చినప్పటికీ శరీరంలో నీరసం, ఆయాసం, ఆకలి లేకపోవడం లేదా అతి ఆకలి నిద్ర లేకపోవడం లేదా అతి నిద్ర వంటి లక్షణాలు గల స్త్రీ, పురుషులకు ఆయుర్వేదంలో చక్కటి చికిత్స ఉంటుంది.

On some instances lab tests are normal but the patient suffers from giddiness, weak, tired, insomnia or excess sleepiness, over appetite or detestation. Ayurveda has good remedy for such female and male patients.

ఆయుర్వేదం ప్రకారం వ్యాధి నిర్ధారణ – Diagnosis in Ayurveda

రోగి శరీర తత్త్వం, వాతావరణం, గత వారం రోజులుగా తీసుకుంటున్న ఆహారం, అతని నాడి చూసి వ్యాధిని గుర్తించడం జరుగుతుంది.

An Ayurvedic doctor diagnosises the patient according to the patient’s metabolism (nature of body), climatic conditions, the food he consumed during the past 7days and his pulse.

చికిత్స – Treatment

రోగిలో పైన ప్రస్తావించిన లక్షణాలకు కాకుండా వ్యాధి దేని కారణంగా వచ్చిందో దానికి చికిత్స చేయడం జరుగుతుంది. రోగి శరీరంలో కనిపించే లక్షణాలకు కాకుండా వ్యాధి కారకానికి చికిత్స చేయాలనేది ఆయుర్వేద మహర్షులు చెప్పిన విషయం.
ఉదాహరణకు – ల్యుకేమియా, బి.పి., షుగర్, శృంగార సమస్యలు ఇవి బయటికి కనిపించవు.

Ayurvedic Yogis suggested to treat the cause of the disease instead of the symptoms. In Ayurvedic treatment doctors cure the disease instead of dealing with the symptoms. Ex:- leukemia, B.P., Diabetics, Sex Problems don’t show external symptoms.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Osmanian.com © 2016
Simple Share Buttons