విశ్వవిధ్యాలయాలకు వేల ఎకరాలు అవసరమా

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0

దేవాలయాల కింద వేల ఎకరాల మాన్యం భూములు ఉన్నాయన్న విషయం మనకు తెలుసు. దేవాలయాల పోషణ నిమిత్తం రాజులు, ఇతర దాతలు ఆ భూముల్ని  దానం ఇచ్చేవారు. ఆ భూముల్ని కౌలుకి ఇచ్చి వచ్చిన ఆదాయాన్ని దేవాలయ నిర్వహణకు వాడేవారు.  విశ్వవిధ్యాలయాలకు వాటి పోషణ నిమిత్తం వందలు, వేల ఎకరాల భూముల్ని దానం ఇచ్చేవారు. నలంద, విక్రమ శిల మొదలైన విశ్వవిధ్యాలయాల కింద కూడా వేల ఎకరాలు భూములు ఉండేవి.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దాదాపు 2500 ఎకరాలు, ఉస్మానియా యూనివర్సిటీలకి 2500 ఎకరాలు ఉన్నాయి.  సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో కొంత గచ్చిబౌలి స్టేడియంకి, ట్రిపుల్ ఐటి కి ఇవ్వడం జరిగింది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ విషయానికి వస్తే యూనివర్సిటీ భూములు ఆక్రమణలకు గురైతున్నప్పుడల్లా విధ్యార్ధులు వాటిని కాపాడుతూ వస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయం చేసి యూనివర్సిటీని పోషించే పరిస్ధితి లేదు. యూనివర్సిటీలకు ప్రభుత్వం నిధులు ఇచ్చి పోషిస్తుంది. కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు కొత్త బిల్డింగులు, కొత్త హాస్టల్స్ కోసం భూమి అవసరం అవుతుంది. అలా అని పూర్తి 2500 ఎకరాలలో ఎంత భవిష్యత్ అవసరాలకు అవసరమో అంచనా వేసి మిగిలిన భూమిని ఇతర అవసరాలకు మళ్ళించవచ్చు.

Osmanian.com © 2016
Simple Share Buttons