Diseases and Medicinal values in our food

Share Free Online Mock Tests and Study Material
12
Share Free Online Mock Tests and Study Material
12

Dr S anjaneyulu ayurvedic doctor in amberpet hyderabadవ్యాధులు – ఆహార పదార్ధాల్లో ఔషద గుణాలు

Diseases and Medicinal values in our food
అతిమూత్ర సమస్య – గోదుమ రొట్టె నూనె లేకుండా తీసుకోవాలి. గోధుమలకు సంబంధించిన ఆహారం వ్యాధిని తగ్గిస్తుంది.

 

Excess Urine – To pacify this problem we should take food items which are made of wheat. We should take chapatis without oil. Wheat has the nature of pacifying the desease.
అల్పమూత్రం – సొరకాయ, బీరకాయ, ముల్లంగిలకు మూత్ర విసర్జనను జరిగే విధంగా చేసే గుణం ఉంటుంది. వీరు గోధుమలకు సంబంధించిన ఆహారాన్ని తీసుకోరాదు.

Less Urine – Bottle gourd, Ritzgourd, Radish helps for free urination. The people who don’t have free urination should avoid food made of wheat.

మలబద్దకం – నల్ల ఉలవల పౌడర్ తో సాంబార్ చేసుకుంటే సులువుగా విరేచనం అవుతుంది.
వాము, మిరియాలు వేసి సాంబార్ చేసుకుని ఆహారం తీసుకుంటే నిరేచనం అవుతుంది.

Constipation – Make sambar / soup with “Black Horse Gram” powder. This helps for the prevention of constipation. If we add Pepper powder and oregano power for any soup / sambar that helps preventing constipation.

 

విరేచనాలు తగ్గించడానికి – పెరుగు నిమ్మరసం కలిపి రెండు నిముషాలు ఉంచి రెండు నిముషాల తరువాత మజ్జిగ చేసి త్రాగితే విరేచనాలు తగ్గుతాయి.
ఒక కప్పు పాలు, బ్రెడ్ తీసుకుంటే విరేచనం తగ్గుతుంది.

Motions – 1. Add lemon juice to curd and take it after 2 minutes.

  1. Take a cup of milk and bread.

ఆతి ఆకలి – పరికడుపున ఒక కప్పు పాలు తాగితే అతి ఆకలి తగ్గుతుంది.
గోధుమ రొట్టె, గోధుమతో చేసిన ఆహార పదార్ధాలు ఆకలిని సమస్ధితికి తెస్తాయి.

Unsatiable Hunger – 1. To pacify unsatiable hunger one should take a cup of milk early in the morning with empty stomach.

  1. Food items made of wheat bring hunger to equal state.

ఆకలి లేకపోవడం – ఒక ఇంచు మోతాదు దాల్చిన చెక్క ఆహారానికి పదిహేను నిముషాల ముందు తిని ఒక్క గ్లాసు మజ్జిగ త్రాగాలి. దీని వల్ల ఆకలి పెరుగుతుంది.

10 ఆకులు పుదీన, 20 ఆకులు కొత్తిమీర మొదటి ఆహారంలో మొదటి ముద్దలో తింటే ఆకలి పెరుగుతుంది.

Appetite Loss – Consumption of 1 inch size cinnamom 15 minutes before 1st meal and 1 glass of butter milk will increase the appetite.

Mix 10 mint leaves and 20 coriander Leaves and make it a lump. Consume it along with first lump of food. This will definitely increase appetite.

 

అధిక దాహం – పాత చింతపండు రసం, సగం చెంచా ఉసిరికాయల పౌడర్, పాత బెల్లం కలిపి పానియం చేసి తాగితే ఆధిక దాహం తగ్గుతుంది. ( షుగర్ ఉన్నవాళ్ళు

బెల్లం వాడకూడదు అందుకని ఒక చెంచాడు తాటి కలకండ  కలుపుకోవాలి )

Excessive thirst – Mix juice from old tamarind, half spoon Amla power and Old jaggery to make juice. Those who are suffering from Diabetics should not use sugar. They can substitute Palm Sugar Candy with sugar.

అల్పదాహం – ఒక కప్పు పాలకు దాహంను పెంచే గుణం ఉంటుంది.
ఒక ఇంచు మోతాదు దాల్చిన చెక్క తింటే దాహం పెరుగి నీరు త్రాగాలనిపిస్తుంది.

No thirst – 1. One cup of milk helps in increasing thirst.

  1. Consumption of 1 inch size cinnamom would increase thirst.

నిద్ర – దీనికి సంబంధించి శరీర తత్త్వం తెలుసుకొని చెప్పాల్సివుంటుంది. కొన్ని గసగసాలు వాసన పీలిస్తే నిద్ర వస్తుంది. కొందరికి పుస్తకం చదివితే నిద్ర వస్తుంది. కొందరి తీరు మరీ కఠినంగా ఉండొచ్చు. అందువల్ల శరీరతత్త్వాన్ని తెలుసుకుని చెప్పాల్సివుంటుంది.

ఇక్కడ తెలిపిన విషయాలు పది నిముషాలనుండి ఇరవై నిముషాల వ్యవధిలో మీ శరీరంలో ఫలితాన్ని చూపిస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మీ శరీరాన్ని మనసుతో గమనించి ఆహారంలో మార్పులు చేసుకోండి.

Insomnia – The remedy for insomnia can be prescribed only after knowing the reasons for individual patient and his / her body metabolism. We get sleep by smelling some Poppy seeds. Some get sleep with in few minutes they start reading a book.

 

All the things we discussed here will show result in few minutes. If you want to stay healthy, just observe the changes in your body and make changes in your food accordingly.

Digestive system plays a very important role in keeping us healthy. We should be able to take good amount of Oxygen. Excretion system should function smoothly. Over appetite, loss of appetitie, excess thirst and loss of thirst also lead to unhealthiness. Everyone should have sound sleep. Sound sleep for even 5 hours is enough to stay healthy.

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా జీర్ణక్రియ వ్యవస్ధ మంచిగా పనిచేయాలి. ఆక్సీజన్ మంచిగా తీసుకోగలగాలి. మల మూత్ర విసర్జనలు దోషాలు ( దుర్వాసన )లేకుండా ఉండాలి.
అతి ఆకలి. ఆకలి లేకపోవడం. అధిక దాహం. దాహం లేకపోవడం అనేది లేకుండా చూసుకోవాలి.
నిద్ర, సుఖప్రధమైన నిద్ర ఉండాలి. మంచి నిద్ర 5గంటలైనా సరిపోతుంది.

ఆక్సీజన్ తీసుకోవడం వలన జీర్ణక్రియ వ్యవస్ధ, రక్త ప్రసరణ వ్యవస్ధ మంచిగా పనిచేస్తుంది. అందుకే రోగికి గాలి బాగా వచ్చే స్ధలంలో  విశ్రాంతిని ఏర్పాటు చేస్తారు.

Good amount of Oxygen helps digestive system, brain functioning, blood circulation system. That is why doctors advice patients to take rest at places of good ventilation where fresh air blows.

జీర్ణక్రియ వ్యవస్ధ – గ్యాస్ట్రిక్ సమస్యDigestive System – Gastric Problems
ఆరోగ్యంగా ఉండాలి అంటే జీర్ణక్రియ వ్యవస్ధలో సంపూర్ణంగా క్రియ జరగాలి. త్రేన్పులు లేకుండా, గొంతులో కడుపులో మంట లేకుండా, కడుపుబ్బరం, ఆయాసం లేకుండా ఉండాలి. గ్యాస్ట్రిక్ సమస్య లేకుండా చూసుకోవాలి. శరీరానికి దేనికారణంగా అనారోగ్యం వచ్చినా జీర్ణక్రియ వ్యవస్ధలో హెచ్చుతగ్గులు వస్తాయి.

Digestive system plays important role in a persons health. One should have comple and smooth digestion of food in digestive system. We should not have repeated Burping, burning sensation in throat and stomach, swelling of stomach and formation of gas in stomach. Any type of illness in the body will retard the functioning of digestive system.

గ్యాస్ట్రిక్ సమస్య – పరికడుపున నీరు త్రాగరాదు.
పచ్చి మిరపకాయలు, పచ్చి కూరగాయలు, పచ్చి మొలకలు తీసుకోరాదు. గ్యాస్ట్రిక్ త్రేన్పులతో బాధపడేవారు తీసుకుంటే ఇంకా సమస్య ఎక్కువ అవుతుంది.

Persons suffering from gastric problem should not take water early in the morning with empty stomach. They should avoid raw vegetables, sprouts and green chillies.

ఉదయం పరికడుపున ఒక్క గ్లాసు మజ్జిగ త్రాగాలి. మొదటి ఆహారం మజ్జిగతో తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్య రాదు.

నీరు ఔషధం అయితే మజ్జిగ అమృతం అని ఆయుర్వేద శాస్త్రం తెలుపుతుంది.

To pacify the gastric trouble, patients should take a glass of butter milk early in the morning.

According to Ayurveda if water is medicine, Butter milk is Elixir / Nectar / /ambrosia

 

Srujan Ayurvedic Clinic & Yoga

Dr. S. Anjaneyulu

Amberpet Main Road,

Hyderabad

# 9533823009

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Osmanian.com © 2016
Simple Share Buttons