రివాల్యుయేషన్

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0

Revaluation

పరీక్ష బాగానే రాశాననుకున్న ఒక విద్యార్థి తనకు సున్నా మార్కులు వచ్చే సరికి ఆశ్చర్యపోయాడు. రీవాల్యుయెషన్ కోసం దరఖాస్తు చేశాడు. మళ్ళీ సున్నా మార్కులే వచ్చాయి. తాను ప్రశ్నలన్నిటికీ జవాబులు రాసినా ఎందుకిలా జరుగుతుందో అర్థంకాక న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కడ కోర్టులో తన క్లయింటు రాసిన జవాబులు సరి అయినవేనని, తప్పు అయితే రుజువు చేయమని వాదించాడు విద్యార్థి తరపు లాయరు. ఆ ప్రశ్నలనీ, విద్యార్ధి రాసిన జవాబులని చదివి వినిపించమన్నారు జడ్జి గారు. అవి ఇలా ఉన్నాయి:
ప్రశ్న: టిప్పు సుల్తాన్ ఏ యుద్ధంలో మరణించాడు ?
జవాబు : అతను పాల్గొన్న చివరి యుద్ధంలో
ప్రశ్న : భారత దేశానికి స్వాతంత్ర్యం ఇస్తూ ఎక్కడ సంతకం చేశారు ?
జవాబు : పేజీ చివరన
ప్రశ్న : మహాత్మా గాంధీ ఎప్పుడు జన్మించారు ?
జవాబు : ఆయన పుట్టిన రోజున
ప్రశ్న : భార్యా భర్తల మధ్య విడాకులకు ప్రధాన కారణం ఏంటి ?
జవాబు : పెళ్ళి
ప్రశ్న : ఆరు మామిడి పళ్ళను ఎనిమిది మందికి సమానంగా ఎలా పంచుతావు ?
జవాబు : మాంగో షేక్ చేసి
ప్రశ్న : గంగా ఫ్లోస్ ఇన్ విచ్ స్టేట్ ?
జవాబు : లిక్విడ్ స్టేట్
ప్రశ్న : భారతదేశంలో ఎక్కువ మంచు పడే చోటు ?
జవాబు : మందు గ్లాసులో
ప్రశ్న : హిందూ చట్టం రెండవ వివాహాన్ని ఎందుకు అంగీకరించదు ?
జవాబు : భారతీయ చట్టం లోని ఆర్టికల్ 20 (2) ప్రకారం ఒక మనిషి చేసిన
ఒకే నేరానికి రెండు సార్లు శిక్ష విధించకూడదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *