Role of Giuseppe Garibaldi in the Unification of Italy

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0

Role of Giuseppe Garibaldi in the Unification of Italy

ఇటలీ ఏకీకరణలో జోసెఫ్ గారిబాల్డీ పాత్రను వ్రాయండి?

Giuseppe Garibaldi brief biography in Telugu

ప్రపంచ చరిత్రలో అతి కొధ్ధిమంది మాత్రమే మనల్ని అత్యంత ప్రభావితం చేసేవారు తారసపడతారు. చె గువెరా కన్నా ముందరి కాలానికి సంబంధించినవాడు జోసెఫ్ గారిబాల్డీ . చె గువెరా తరువాత అంతటి నిస్వార్ధ నాయకుడు జోసెఫ్ గారిబాల్డీ. గారిబాల్డీ సాహసికుడు. గొప్ప మానవతావాది. నిస్వార్ధపరుడు. గొప్ప నాయకుడు.

జోసెఫ్ గారిబాల్డీ గొప్పదేశభక్తుడు. 1807లో నైస్ లో గారిబాల్డీ జన్మించాడు. గారిబాల్డీ స్వతహాగా మంచి సాహసికుడు. సాహసాల్లో ఇష్టంతో గారిబాల్డీ నావికుడిగా మారాడు. మాజినీ ప్రభావంతో గారిబాల్డీ ‘యంగ్ ఇటలీ’లో సభ్యుడిగా చేరాడు. గెరిల్లా యుద్దరీతిలో తన ప్రతిభ కారణంగా గారిబాల్డీ ఇటలీలో చాలా ప్రసిధ్ధుడ్యాయడు.

1834లో మాజినీ సవాయ్ లో తిరుగుబాటు లేవదీసినప్పుడు గారిబాల్డీ అందులో ప్రముఖ పాత్ర పోషించాడు. తత్ఫలితంగా గారిబాల్డీకి మరణ శిక్ష విధించారు. కానీ గారిబాల్డీ తప్పించుకొని దక్షిణ అమెరికాకి పారిపోయి అక్కడే పద్నాలుగు సంవత్సరాలు జీవించాడు. దక్షిణ అమెరికాలో ‘ఇటాలియన్ లీజియన్’ ను స్ధాపించి అక్కడి యుద్దాల్లో పాల్గొన్నాడు.

1848లో ఇటలీ స్వాంత్రత్ర్య పోరాటం గురించి తెలుసుకుని ఇటలీకి వచ్చాడు. ఆస్ట్రియాకు వ్యతిరేకంగా జరిగే యుద్దంలో చురుకుగా పాల్గొన్నాడు. 1849లో రోమ్ లో మాజినీ జరిపే తిరుగుబాటులో కూడా గారిబాల్డీ కీలకపాత్ర పోషించాడు. ఓడిపోయే దశలో ఉన్నప్పుడు గారిబాల్డీ నాలుగువేల సైన్యంతో పారిపోయాడు. వెనీషియాలో గారిబాల్డీ తిరుగబాటు లేవదీయాలని ప్రయత్నించాడు. ఫ్రాన్స్, ఆస్ట్రియాల దృష్టిలో గారిబాల్డీ పడటం వల్ల అనేక కష్టాలను ఎదుర్కోవాల్సివచ్చింది. తన భార్యతో సహా అడవులు కొండల్లో జీవితాన్ని సాగించాడు. ఫ్రాన్స్, ఆస్ట్రియా సేనలు అడవులు కొండ్లలో కూడా గారిబాల్డీని వెంటాడాయి. ఈ పోరాటంలో గారిబాల్డీ తన భార్య అనిత ను కోల్పోయాడు. చివరికి గారిబాల్డీ దక్షిణ అమెరికాకు పారిపోయాడు. గారిబాల్డీ తన ధైర్య సాహసాలతో అనేక మందికి ఆదర్శవ్యక్తిగా నిలిచాడు.

1854లో గారిబాల్డీ తిరిగి ఇటలీకి వచ్చాడు. 1859లో ఫ్రాంకో-సార్డీనియా-ఆస్ట్రియా యుద్దంలో ఆస్ట్రియాకు వ్యతిరేకంగా పాల్గొన్నాడు. గారిబాల్డీ మూడో నెపోలియన్ విదానాలవల్ల తీవ్రంగా మనస్తాపం చెందాడు.

1860లో సిసిలీ ప్రజలు నేపుల్స్ రాజు రెండో ఫ్రాన్సిస్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు గారిబాల్డీని సాయం కోరారు. దేశభక్తితో నిండిన గారిబాల్డీకి సాహసాలంటే మక్కువ ఎక్కువ. ఇటలీ ఏకీకరణకై ఎక్కడ తిరుగబాటు జరిగినా సాయం చేయడానికి గారిబాల్డీ ఎల్లప్పుడూ సిధ్ధంగా ఉంటాడు. నేపుల్స్ రాజు తనకు మిత్రుడు అవడం వల్ల గారిబాల్డీ తాత్కాలికంగా వెనకడుగు వేసినా చివరికి యుద్దానికి సిధ్ధమయ్యాడు. కౌంట్ కేవర్ గారిబాల్డీకి రహస్యంగా సాయం చేసాడు. రెండో విక్టర్ ఇమ్మాన్యుయెల్ కూడా ఆర్ధికంగా గారిబాల్డీకి సాయం చేసాడు. జెనోవాలో గారిబాల్డీ స్వచ్చంద సేనలను సిధ్ధంచేసుకున్నాడు. వారంతా ఎర్రచొక్కాలు ధరించేవారు. ఆనిదంగా గారిబాల్డీ సేనకు ‘రెడ్ షర్ట్స్’ అని పేరు వచ్చింది.

 

నేపుల్స్ రాజు మొత్తం సైన్యం 1,24,000. గారిబాల్డీ సైన్యం వేలల్లో మాత్రమే ఉంది. అయినా గారిబాల్డీ వెనకాడలేదు. ధైర్యంతో ముందుకు సాగిన గారిబాల్డీని విజయం వరించింది. సిసిలీ ఘోరపరాజయం పాలైంది. గారిబాల్డీ సిసిలీ రాజయ్యాడు. అనంతరం గారిబాల్డీ నేపుల్స్ మీద కూడా దాడి చేసాడు. 6 సెప్టెంబర్ 1860న నేపుల్స్ రాజు రాజ్యాన్ని విడిచి పారిపోయాడు.

 

గారిబాల్డీ రోమ్ పై దాడిచేసి రోమ్ కి విముక్తి కల్పించాలని భావించాడు. కానీ పోప్ కు ఫ్రెంచ్ సైన్యం సహాయాన్ని అందిస్తూ రోమ్ లో తిష్టవేసి ఉండటం వల్ల కౌంట్ కేవర్ గారిబాల్డీని రోమ్ పై దాడి చేయకుండా అడ్డుకున్నాడు. గారిబాల్డీ రోమ్ పై దాడిచేస్తే సుశిక్షితులైన ఫ్రాన్స్ సైన్యంతో తలపడాల్సివచ్చేది. కౌంట్ కేవర్ గారిబాల్డీ గెలిచిన ప్రాంతాలను పిడమాంట్ రాజు రెండవ విక్టర్ ఇమ్మాన్యుయెల్ కు ఇచ్చివేయాల్సిందిగా గారిబాల్డీతో ఒప్పందం చేసుకున్నాడు. కానీ గారిబాల్డీ ఏవిధమైన ధనం, గౌరవాలు స్వీకరించకుండానే విక్టర్ ఇమ్మాన్యుయెల్ కు నేపుల్స్ సిసిలీలను అప్పజెప్పాడు. గారిబాల్డీ ఉద్దేశంలో దేశభక్తికి మించిన గౌరవం మరొకటి లేదు.

కౌంట్ కేవర్, విక్టర్ ఇమ్మాన్యుయెల్ ఇచ్చిన బహుమానాలేవీ స్వీకరించకుండా కేవలం ఒక సంచిలో ధాన్యాలను తీసుకుని కాప్రెరా దీవికి వెళ్లిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *