Role of Mazzini in the Unification of Italy

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0

Role of Mazzini in the Unification of Italy

ఇటలీ ఏకీకరణలో జోసెఫ్ మాజిని పాత్రను వ్రాయండి?

Free Notes for History of Modern Italy in Telugu

మాజినీ ఇటలీ గొప్పనాయకుల్లో ఒకరు. తన జీవతంలో ప్రతివిషయాన్ని ఇటలీ ఏకీకరణ నిమిత్తం మాజినీ త్యాగం చేశాడు. మాజినీ ని ఇటలీ ఆత్మగా పేర్కొంటారు. 1805లో జెనోవాలో మాజీనీ జన్మించాడు. ఆయన తండ్రి ఒక డాక్టర్. మాజినీ తండ్రి ఫ్రెంచ్ విప్లవ లక్ష్యాలను బలంగా విశ్వసించేవాడు. మాజినీ ఫ్రెంచ్ విప్లవానికి సంబందించిన సాహిత్యాన్నే ఎక్కువగా అధ్యయనం చేశాడు. మాజినీ కుటుంబం దేశ భక్తి, జాతీయత భావం, తిరుగుబాట్లకు సంబంధించిన విషయాలగూర్చి మద్యే ఉండేది. ఇలాంటి వాతావరణంలో పెరిగిన మాజినీ చిన్నతనంలోనే గొప్పతిరుగుబాటుదారునిగా ఎదిగాడు. పరాయిపాలన నుండి ఇటలీని విముక్తం చేయడమే మాజినీ లక్ష్యం. ఇటలీ ఏకీకరణకు ఆస్ట్రియా పెద్ద శత్రువని, ఆస్ట్రియాను ఇటలీ నుండి పారద్రోలకుండా ఇటలీ ఏకీకరణ సాధ్యం కాదని మాజినీ బలంగా విశ్వసించేవాడు.

ఆ కాలంలో కార్బొనారీ మాత్రమే ఏకైన రహస్య విప్లవ సంఘం. చిన్న వయసులోనే కార్బొనారీ లో సభ్యుడిగా చేరి తన తిరుగుబాటు మనస్తత్వం వల్ల అనతి కాలంలోనే అరెస్టు చేయబడ్డాడు. జైల్లో ఉండికూడా విప్లవ భావాల్ని ఉత్తరాల ద్వారా, పాంప్లెట్ల ద్వారా ఇతరులతో పంచుకొనేవాడు. కొంత కాలానికి కార్భొనారికి ఒక ఖచ్చితమైన దిశానిర్ధేశం లేదని తెలుసుకున్నాడు.

మాజినీ ఇటలీని ఏకీకృతం చేసి బలమైన రిపబ్లికన్ సమాఖ్యను ఏర్పాటుచేయాలనుకున్నాడు. విప్లవ కార్యక్రమాల వల్ల మాజినీ ని ఇటలీ నుండి బహిష్కరించడంతో నలభై సంవత్సరాలు వివిధ దేశాలు తిరిగాడు. ఫ్రాన్స్ లో జులై విప్లవం విజయవంతం అవడంతో ఇటలీలో కూడా నిరంకుశ రాచరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. పార్మా, మొడెనా, టస్కనీ, పాపల్ రాష్ట్రాల రాజులు రాజ్యం విడిచి పారిపోయినా ఆస్ట్రియా జోక్యంతో తిరిగి రాచరికాన్ని చేపట్టారు. మెటర్నిక్ సూచనల ప్రకారం తిరుగుబాటుదారుల్ని చాలా క్రూరంగా అణచివేసారు. విప్లవంలో పాల్గొన్న మాజిని ని దేశ బహిష్కరణ చేసి ఫ్రాన్స్ కు పంపించారు.

తిరుగుబాటు అణచివేత మాజినీని తీవ్రంగా కలచివేసింది. కార్బొనారీ పని విదానం నచ్చని మాజినీ అంతకంటే ఎక్కువ నిబద్దతతో పనిచేసే సంఘాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఇటలీ యువకులతో ‘యంగ్ ఇటలీ’  అనే సంఘాన్ని స్ధాపించాడు. భౌగోళికంగా, రాజకీయంగా విడగొట్టబడినా సాంస్కృతిక పరమైన ఏకత్వం వల్ల ఇటాలియన్లందరికీ తమ జాతిపట్ల ఏకీకృత భావం ఉండేది.

1848కి ముందు ఇటలీ జాతీయవాదుల్లో ఐక్యత లేదు. ఎజెలియో అనే ఇటాలియన్ దేశభక్తుడు రాచరికానికి, విప్లవానికి కూడా వ్యతిరేకి. ఆయన రిపబ్లికన్ ప్రభుత్వ ఏర్పాటును ఆకాంక్షించేవాడు.

రోమన్ కాథలిక్ లు పోప్ ఆద్వర్యంలో ప్రభుత్వం ఏర్పడాలని ఆంకాంక్షించేవారు.

ఫ్రాన్స్ లో 1848 విప్లవానికి ముందే ఇటలీకి సంబంధించిన నేపుల్స్, టస్కనీ, పిడమాంట్, రోమ్ రాజ్యాల్లోని రాజులు ప్రజలకు అనుకూలమైన రాజ్యాంగాన్ని విడుదల చేశారు. 1846లోనే రోమ్ కి రాజైన తొమ్మిదవ పోప్ పయస్ చాలా ఉదారమైన రాజకీయ ఆలోచనలు కలిగి ప్రజారంజకంగా పాలించేవాడు. 1848విప్లవం తరువాత మెటర్నిక్ ప్రాభవం పూర్తిగా క్షీణించింది. ప్రజలు వివిధ ప్రాంతాల రాజులందరూ ఏకమై అస్ట్రియా సైన్యాన్ని, ఆస్ట్రియా ప్రభావాన్ని తమ దేశం నుండి తొలంగించాలని రాజులకు సూచించారు.

అస్ట్రియాకు వ్యతిరేకంగా జరిగిన యుద్దంలో చార్లెస్ ఆల్బర్ట్ మాత్రమే చివరివరకూ పోరాడాడు. మిగతా ఇటాలియన్ రాజులు మద్యలోనే విరమించుకున్నారు. చార్లెస్ అల్బర్ట్ సింహాసనాన్ని తన కుమారుడు రెండవ విక్టర్ ఇమ్మాన్యుయెల్ కు అప్పగించాడు.

మాజినీ రోమ్ లో రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి రాజు రాజ్యాన్ని వదిలిపోయేలా చేసాడు. మాజినీ మరియు ఇతరులు రోమ్ లో రిపబ్లికన్ ప్రభుత్వాన్ని ఏర్పరచినా అనతికాలంలోనే లూయీ నెపోలియన్ వారి ప్రభుత్వాన్ని కూల్చివేసాడు.

మాజినీ స్ధాపించిన సంస్ధవల్ల దేశ ప్రజలను ఆదర్శవంతులుగా, జాతీయవాదులుగా, దేశభక్తిపరులుగా తయారుచేసింది. ఇటాలియన్లను అభివృధ్ధి చేసిన నాయకుడిగా ఇటలీ చరిత్రలో మాజినీ స్ధానం చిరస్థాయిగా నిలిచిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *