Role of Metternich in European Politics
Free Notes for History of Europe in Telugu
ఐరోపా రాజకీయాల్లో మెటర్నిక్ పాత్రను వివరించండి?
క్లెమెన్స్ వాన్ మెటర్నిక్
క్లెమెన్స్ వాన్ మెటర్నిక్ 15 మే 1773న జన్మించాడు. 1809 నుండి 1848 వరకు ఆస్ట్రియా విదేశీ వ్యవహారాల మంత్రి గా వ్యవహరించాడు. నెపోలియన్ బోనపార్టీని మించి ఐరోపా వ్యవహారాల్లో మెటర్నిక్ కీలక పాత్రను నిర్వహించాడు. వియన్నా కాంగ్రెస్ అద్యక్షుడిగా మెటర్నిక్ చాలా కీలక భాద్యతను నిర్వహించాడు.
ఫ్రాన్స్ కు రాయబారిగా మెటర్నిక్
మెటర్నిక్ దనవంతుల కుటుంబంలో జన్మించాడు. ఆయన కుటుంబ సభ్యులు పలువులు ప్రభుత్వ పదవుల్లో ఉన్నారు. మెటర్నిక్ తత్త్వశాస్త్రాన్ని, న్యాయశాస్త్రాన్ని, దౌత్యవిధానాల్ని అద్యయనం చేసి తన తండ్రి బాటలోనే రాయబారి వృత్తిని ఎంచుకున్నాడు.
ఆస్టలిట్జ్ యుద్దంలో ఫ్రాన్స్ చేతిలో ఆస్ట్రియా ఘోరపరాజయం పాలై చాలా భూబాగాలను కోల్పోయింది. దీని అనంతరం ఆస్ట్రియా మెటర్నిక్ ను ఫ్రాన్స్ కు రాయబారిగా పంపింది.
నెపోలియన్ ను మెటర్నిక్ చాలా దగ్గరనుండి పరిశీలించాడు. ఫ్రాన్స్ కు క్రమశిక్షణ అవసరం. నెపోలియన్ మాత్రమే ఫ్రాన్స్ కు క్రమశిక్షణ నేర్పగలడని మెటర్నిక్ భావించాడు.
విదేశీ వ్యవహారాల మంత్రిగా మెటర్నిక్
1809 అక్టోబర్లో మెటర్నిక్ ఆస్ట్రియా విదేశీవ్యవహారాల మంత్రిగా నియమించబడ్డాడు. నెపోలియన్ అంతమయ్యేవరకూ ఆస్ట్రియాను కాపాడుకోవడమే మెటర్నిక్ లక్ష్యం.
నెపోలియన్ పాలనను అంతం చేయాలని మెటర్నిక్ బావించాడు. ఆస్ట్రియా చక్రవర్తి మొదటి ఫ్రాన్సిస్ కుమార్తె మేరీ లౌసీ తో నెపోలియన్ వివాహాన్ని మెటర్నిక్ కుదిర్చాడు.
మెటర్నిక్ 1812లో ఫ్రాన్స్ రష్యా మీద దాడిచేసినప్పుడు ఫ్రాన్స్ కు ఆస్ట్రియా సాయం అందిస్తుందని ఫ్రాన్స్ ను నమ్మించాడు. కానీ రహస్యంగా రష్యాకు సాయపడ్డాడు. ఫ్రెంచ్ ఓటమి అనంతరం మెటర్నిక్ తటస్ధ విధానాన్ని వదిలివేసి నెపోలియన్ కు వ్యతిరేకంగా మిగతా దేశాలను ఏకం చేశాడు. 26 జూన్ 1813న నెపోలియన్ ను మెటర్నిక్ చివరిసారిగా కలిసాడు. ఆ సమావేశంలో నెపోలియన్ అంతం సమీపంలో ఉందని మెటర్నిక్ నెపోలియన్ తో అన్నాడు.
ఆస్ట్రియా సాయంతో రష్యా, ప్రష్యా, బ్రిటన్ నెపోలియన్ ను ఓడించగలిగాయి. కృతజ్ఞతగా ఆస్ట్రియా రాజు మొదటి ఫ్రాన్సిస్ మెటర్నిక్ ను ఆస్ట్రియా యువరాజుగా ప్రకటించాడు.
నెపోలియన్ తదనంతర ప్రపంచం
వియన్నా కాంగ్రెస్ లో తీసుకున్న నిర్ణయాల్లో మెటర్నిక్ కీలకపాత్ర పోషించాడు. నెపోలియన్ ఎల్బా నుండి తప్పించుకోవడంతో వియన్నా కాంగ్రెస్ కు అంతరాయం ఏర్పడింది. నెపోలియన్ వాటర్లూ యుద్దంలో ఓడించబడ్డాడు.
శక్తివంతమైన దేశాల మధ్య సఖ్యతతోనే యూరోప్ శాంతియుతంగా ఉండగలదని మెటర్నిక్ భావించాడు. ఆస్ట్రియాను అంతర్గతంగా శాంతియుతంగా ఉంచడం, బాహ్యంగా శక్తివంతంగా ఉంచడం మెటర్నిక్ లక్ష్యం.
మెటర్నిక్ కులీనుల పాలనను ఇష్టపడేవాడు. రాజులు పాలించడానికి ప్రజలు పాలించబడటానికే ఉన్నారని బలంగా విస్వసించేవాడు. తిరుగుబాట్లు, ఉదారవాదం, జాతీయవాదాల్ని వ్యతిరేకించాడు.
మెటర్నిక్ పీరియాడిక్ కాంగ్రెస్ లో తిరుగుబాట్లను ఎలా అణచివేయాలనే విషయాలపై చర్చించేవాడు.
1821లో మెటర్నిక్ ఆస్ట్రియన్ కోర్ట్ చాన్సెలర్ గా, చాన్సెలర్ గా నియమించబడ్డాడు.
1848లో వియన్నా లో జరిగిన ఒక విప్లవం వల్ల రాజీనామా చేసేంత వరకూ మెటర్నిక్ ఐరోపా ఖండ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాడు.