Role of Victor Immanuel in the Unification of Italy

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0

Role of Victor Immanuel in the Unification of Italy

విక్టర్ ఇమ్మాన్యుయెల్ గురించి వ్రాయండి?

Victor Immanuel brief biography in Telugu

రెండవ విక్టర్ ఇమ్మాన్యుయెల్ సార్డీనియా రాజు. ఇమ్మాన్యుయెల్ ఉదార రాజ్యాంగాన్ని అమలుపరచి ప్రజల అబిమాన్నాన్ని చూరగొన్నాడు. తన జీవితకాలంలో ఇటలీ ఏకీకరణకు తోడ్పడ్డ కౌంట్ కేవర్ వంటి వారి ప్రాముఖ్యతను గుర్తిస్తూ సమయానుకూల నిర్ణయాలతో, ప్రజారంజక పాలనతో ముందుకు సాగాడు.

విక్టర్ ఇమ్మాన్యుయెల్ తండ్రి చార్లెస్ ఆల్బర్ట్ గొప్పజాతీయవాది. ఇటలీ ఏకీకరణ తన శ్వాసగా బ్రతికాడు.

ఫ్రాన్స్ లో 1848 విప్లవానికి ముందే ఇటలీకి సంబంధించిన నేపుల్స్, టస్కనీ, పిడమాంట్, రోమ్ రాజ్యాల్లోని రాజులు ప్రజలకు అనుకూలమైన రాజ్యాంగాన్ని విడుదల చేశారు. 1846లోనే రోమ్ కి రాజైన తొమ్మిదవ పోప్ పయస్ చాలా ఉదారమైన రాజకీయ ఆలోచనలు కలిగి ప్రజారంజకంగా పాలించేవాడు. 1848విప్లవం తరువాత మెటర్నిక్ ప్రాభవం పూర్తిగా క్షీణించింది. ప్రజలు వివిధ ప్రాంతాల రాజులందరూ ఏకమై అస్ట్రియా సైన్యాన్ని, ఆస్ట్రియా ప్రభావాన్ని తమ దేశం నుండి తొలంగించాలని రాజులకు సూచించారు.

అస్ట్రియాకు వ్యతిరేకంగా జరిగిన యుద్దంలో చార్లెస్ ఆల్బర్ట్ మాత్రమే చివరివరకూ పోరాడాడు. మిగతా ఇటాలియన్ రాజులు మద్యలోనే విరమించుకున్నారు. చార్లెస్ అల్బర్ట్ సింహాసనాన్ని త్యజించి రాజ్యాన్ని తన కుమారుడు రెండవ విక్టర్ ఇమ్మాన్యుయెల్ కు అప్పగించాడు.

1831 జులై లో జోసఫ్ మాజినీ యంగ్ ఇటలీ అనే జాతీయవాద సంఘాన్ని స్ధాపించాడు. సార్డీనియా-పిడమాంట్ ప్రదానిగా కౌంట్ కేవర్ అనే జాతీయవాది నియమించబడ్డాడు. ఇటలీని ఐక్యం చేయడానికి కేవర్ పథకాలు రచించాడు. సార్డీనియా రాజు విక్టర్ ఇమ్మన్యుయెల్ కేవర్ కు తన పూర్తి మధ్దతును ఇచ్చాడు. కొన్నిసార్లు అభిప్రాయభేదాలు వచ్చినా విక్టర్ ఇమ్మాన్యుయెల్ కేవర్ గుణగణాలు పూర్తిగా తెలిసిన వ్యక్తిగా అతన్ని ఎప్పుడూ దూరం పెట్టలేదు. 1859లో మూడవ నెపోలియన్ ఆస్ట్రియాతో చేసుకున్న విల్లాఫ్రాంకా సంధినచ్చని కౌంట్ కేవర్, ఆస్ట్రియాతో యుధ్దాన్ని కొనసాగించి, నెపోలియన్ కు తగిన విధంగా గుణపాటం చేప్పాలని ఇమ్మాన్యుయెల్ కు సూచించాడు. నెపోలియన్ తో ఢీ కొట్టడం సరైన పనికాదని విక్టర్ ఇమ్మాన్యుయెల్ వ్యూహాత్మకంగా మౌనం వహించాడు. విల్లాఫ్రాంకా సంధి ద్వారా మూడో నెపోలియన్ ఇటలీకి పూర్తిగా అన్యాయం చేయాలనుకోలేదు. మధ్యే మార్గంగా ఆస్ట్రియా, ఇటలీతో స్నేహ సంబంధాలని కొనసాగించాలని భావించాడు. ఇది గ్రహించిన విక్టర్ ఇమ్మాన్యుయెల్ మూడో నెపోలియన్ తో తొందరపడి శతృత్వాన్ని కొనితెచ్చుకోదలుచుకోలేదు. 1859లో కేవర్ ప్రధాని పదవికి రాజీనామా చేసినా, విక్టర్ ఇమ్మాన్యుయెల్ తన అహాన్ని పక్కన పెట్టి ఇటలీ జాతి మేలుకోరే వ్యక్తిగా కేవర్ ని తిరిగి ఆ పదవిని అలంకరించవలసిందిగా ఆహ్వానించాడు. ఆరు నెలల అనంతరం కేవర్ తిరిగి ప్రధాని పదవిని స్వీకరించాడు.

ఉత్తర, మధ్య ఇటలీ రాజ్యాలు పిడమాంట్ తో కలిసి ఇటలీ ఏకీకరణ చేయాలనుకున్నప్పుడు దానికి మూడో నెపోలియన్ అడ్డు తగలకుండా విక్టర్ ఇమ్మాన్యుయెల్ మూడో నెపోలియన్ కు సవాయ్, నైస్ ప్రాంతాలను ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. సవాయ్ రెండో విక్టర్ ఇమ్మాన్యుయెల్ పూర్వికుల ప్రాంతం. అయినా ఇటలీ ఏకీకరణ కొరకు విక్టర్ ఇమ్మాన్యుయెల్ సవాయ్ త్యాగానికి సిధ్ధపడ్డాడు.

ఇటలీ ఏకీకరణకు విక్టర్ ఇమ్మాన్యుయెల్ ఎన్నో త్యాగాలు చేసి, చాలా ఓర్పుతో, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఇటలీ ఏకీకరణను సాకారం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *