Role of Vienna Congress in establishing peace in Europe

Share Free Online Mock Tests and Study Material
0
Share Free Online Mock Tests and Study Material
0

Role of Vienna Congress in establishing peace in Europe

Free World History Notes in Telugu

ఐరోపాలో శాంతిని నెలకొల్పడంలో వియన్నా కాంగ్రెస్ పాత్రను వివరించండి.

వియన్నా కాంగ్రెస్ 1814 సెప్టెంబర్ నుండి 1815 వరకు జరిగింది. నెపోలియన్ బోనపర్టీ పతనానంతరం తిరిగి ఐరోపాలో యుద్దాలను నివారించడానికి వియన్నా కాంగ్రెస్ సమావేశపరచబడింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఐరోపా దేశాల సరిహద్దులను చాలా వరకు మార్చాల్సిఉంటుంది.

ఐరోపాలోని పెద్ద దేశాలైన ఆస్టియా, రష్యా, ప్రష్యా, బ్రిటన్ లు కీలక నిర్ణయాలను తీసుకున్నాయి. ఆస్ట్రియా ప్రిన్స్ క్లెమెన్స్ వాన్ మెటెర్నిక్ అనే ఆస్ట్రియన్ మంత్రిని తన ప్రతినిధిగా పంపింది. మెటర్నిక్ వియన్నా కాంగ్రెస్ కు అధ్యక్షుడుగా వ్యవహరించాడు.

రష్యా చక్రవర్తి మొదటి అలెగ్జాండర్ రష్యాకు ప్రాతినిద్యం వహించాడు.

ప్రిన్స్ కార్స్ ఆగస్ట్ వాన్ హార్డెన్ బర్గ్ ప్రష్యా ప్రధాన ప్రతినిధి.

మొదట లార్డ్ కాసెల్ రీగ్, అనంతరం మొదటి డ్యూక్ ఆప్ వెల్లింగ్ టన్ ఆర్ధర్ వెల్లస్లీ బ్రిటన్ ప్రతినిధులుగా వ్యవహరించారు.

పెద్దరాజ్యాలు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఫ్రాన్స్, స్పెయిన్ మరియు చిన్నరాజ్యాల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని భావించాయి. ఏదేమైనా ఫ్రాన్స్ రాజనీతిజ్ఞుడు చార్లెస్ మౌరైస్ డి టాలెరాండ్ ఫ్రాన్స్ కు కూడా చర్చల్లో సమాన విలువ ఉండేలా వారిని ఒప్పించగలిగాడు. టాలెరాండ్ ఓటే చాలా చర్చల్లో కీలక ఓటుగా నిలిచింది.

 

వియన్నా కాంగ్రెస్ ముఖ్య నిర్ణయాలు:

  1. నెపోలియన్ గెలిచిన అన్ని ప్రాంతాలను ప్రాన్స్ తిరిగి ఇచ్చివేయాల్సిందిగా నిర్ణయించారు. పద్దెనిమిదవ లూయీ పాలనతో ఫ్రాన్స్ రాచరికం పునర్నిర్మించబడింది.
  2. ఆస్ట్రియా కోల్పోయిన చాలా ప్రాంతాలను ఆస్ట్రియాకు తిరిగి ఇచ్చారు. దీనితోపాటూ ఆస్ట్రియాకు జర్మనీ, ఇటలీ ప్రాంతాలు లొంబార్డీ, వెనిస్ లను కూడా ఇవ్వడం జరిగింది.
  3. రష్యాకు ఫిన్లాండ్ ను ఇచ్చి పోలాండ్ పై ఆధిపత్యాన్ని ఇచ్చారు.
  4. ప్రష్యాకు సాక్సొని, వెస్ట్ ఫాలియా, రైన్ ప్రావిన్సుల్లో ముఖ్య ప్రాంతాలను ఇచ్చారు.
  5. బ్రిటన్ కు వ్యూహాత్మకంగా కీలక ప్రాంతాలను, సముద్రాలపై ఆధిపత్యాన్ని ఇచ్చారు.
  6. ఢఛ్ రిపబ్లిక్ ను ఆస్ట్రియన్ నెదర్లాండ్స్ తో కలిపి ఒకే హౌజ్ ఆఫ్ ఆరెంజ్ ఆద్వర్యంలో నెదర్లాండ్స్ రాజ్యంగా ఏర్పరచారు.
  7. నార్వే మరియు స్వీడన్ ఒకే పాలనకిందికి చేరాయి.
  8. స్పెయిన్ ఏడవ ఫెర్డినాండ్ కు తిరిగి ఇవ్వబడింది.
  9. స్విట్జర్లాండ్ తటస్ధ దేశంగా ప్రకటించబడింది.

వియన్నా కాంగ్రెస్ ఫలితాలు:

ఐరోపా దేశాలమధ్య శాంతిని నెలకొల్పడమే వియన్నా కాంగ్రెస్ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని వియన్నా కాంగ్రెస్ చాలా వరకు చేరుకుంది. వియన్నా సమావేశం అనంతరం దాదాపు 40సంవత్సరాల వరకు ఐరోపాలో శాంతి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *