Vandemataram movement in Nizam state

Vandemataram movement in Nizam state 

ప్రశ్న: హైదరాబాద్ రాష్ట్రంలోని వందేమాతరం ఉద్యమం (29 నవంబర్ 1938 నుండి 30 డిసెంబర్ 1940)

పరిచయం: download audio of this answer
వందేమాతరం ఉద్యమం భారత స్వాతంత్ర్య సమరంలో ఓ గొప్ప మలుపుగా నిలిచింది. దేశమంతటా ఈ పాట ఒక చైతన్య గీతంగా మారినప్పటికీ, హైదరాబాద్ రాష్ట్రంలో దీనిపై నిషేధం విధించబడటం విద్యార్థుల్లో ఆందోళనకు దారితీసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ పాట పాడిన విద్యార్థులు, ప్రభుత్వం దృష్టిలో “తిరుగుబాటు కారులు” అయ్యారు. పాట ద్వారా వారు వ్యక్తీకరించిన ప్రేమ దేశం పట్ల గల నిజమైన అంకితభావాన్ని చూపించింది. ఈ ఉద్యమం యువకులలో ఉన్న దేశభక్తిని, తమ హక్కుల కోసం పోరాడే ధైర్యాన్ని ప్రపంచానికి చూపించింది. నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనకు విద్యార్థి శక్తి ఇచ్చిన గట్టి సమాధానంగా ఈ ఉధ్యమం నిలిచింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆవిర్భావం
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1917 ఏప్రిల్ 26న ఓ ఫర్మాను జారీ చేశారు, దీని ద్వారా ఓ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలన్న నిర్ణయం వెలువడింది. ఫలితంగా, 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించబడింది. అనంతరం 1919 ఆగస్టు 28న ఆర్ట్స్ కళాశాల కార్యకలాపాలు ప్రారంభించాయి.

వందేమాతరం పాట పరిచయం
‘వందేమాతరం’ అంటే ‘తల్లికి వందనం’ అని అర్థం. ఈ పాటను తొలుత దేవీ దుర్గమ్మకు అంకితంగా రచించారు. తరువాత దీన్ని భారత మాతకు అంకితంగా భావించారు. ‘ఆనంద మఠ్’ అనే బంగ్లా నవల రచయిత బంకించంద్ర చటర్జీ దీనిని రచించారు. ఈ నవలలో వందేమాతరం పాట భాగంగా ఉంటుంది. వాసుదేవ్ బాలవంతరావ్ ఫడ్కే చేసిన స్వాతంత్ర్య పోరాటం ఆనంద మఠ్ నవలకు ప్రేరణగా నిలిచింది. ఈ నవల నేపథ్యం సంయాసి తిరుగుబాటు (Sanyasi Rebellion).

1896లో ప్రఖ్యాత కవి రవీంద్రనాథ్ ఠాగూర్ వందేమాతరం పాటను తొలిసారిగా స్వరపరిచారు. ఇది భారతదేశంలోని స్వాతంత్ర్య సమరయోధులకు గొప్ప ప్రేరణగా నిలిచింది. 1905లో వారణాసిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలో ఈ పాటను జాతీయ గీతంగా ప్రకటించారు. అదే సభలో సారలాదేవి చౌదురానీ ఈ పాటను ఆలపించారు. ఆ సమావేశానికి అధ్యక్షత వహించినవారు దాదాభాయ్ నౌరోజి.

హైదరాబాద్‌లో వందేమాతరం ఉద్యమం ఎలా ప్రారంభమైంది?
1938లో దసరా పండుగ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం B హాస్టల్ విద్యార్థులు వందేమాతరం పాటను ఆలపించారు. అయితే అంతకు మునుపే ఈ పాటపై నిజాం ప్రభుత్వం నిషేధం విధించింది. హాస్టల్‌లో ఉన్న హిందూ ప్రార్థనా మందిరంలో ఈ పాట పాడటాన్ని ముస్లిం విద్యార్థులు వ్యతిరేకించి యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో యూనివర్సిటీ అధికారులు ప్రార్థనా మందిరాన్ని మూసివేశారు. అయినా విద్యార్థులు వందేమాతరం పాట పాడటాన్ని కొనసాగించారు. వారు హాస్టల్ వరండాలో పాటను పాడుతూ తమ అభ్యుదయ భావాలను తెలియజేశారు.

రంజాన్ సెలవుల అనంతరం హాస్టల్ 1938 నవంబర్ 28న తిరిగి తెరవబడింది. యూనివర్సిటీ అధికారులు విద్యార్థులను వందేమాతరం పాటను పాడవద్దని హెచ్చరించారు. అంతేకాకుండా విద్యార్థులు నీలం రంగు షెర్వానీ, పైజామా ధరించాలన్న ఆదేశాలు జారీ చేశారు. దీనికి నిరసనగా B హాస్టల్‌కు చెందిన విద్యార్థి అచ్యుతరెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇది 1938 నవంబర్ 29న జరిగింది. దీనివల్ల విద్యార్థులను హాస్టల్ నుండి వెలివేసి సస్పెండ్ చేశారు.

ఉద్యమంలో ప్రముఖుల భాగస్వామ్యం
వందేమాతరం ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు పి.వి.నరసింహారావు, మార్రి చెన్నారెడ్డి, ధర్మ భిక్షం, హయగ్రీవాచారి తదితరులు పాల్గొన్నారు. నిజాం ప్రభుత్వం ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను ఇతర విశ్వవిద్యాలయాల్లో చేర్పించవద్దని ఆదేశాలు జారీ చేసింది.

నిజాం కాలేజీకి చెందిన విద్యార్థి నాయకుడు అబిద్ హుస్సేన్ అన్సారీ ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఆయనతోపాటు నిజాం కాలేజీకి చెందిన మహదేవ్ సింగ్ కూడా పాల్గొన్నారు. వీరితో పాటు మరికొంతమంది విద్యార్థులు ఈ ఉద్యమాన్ని మద్దతు పలికారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం ప్రభావంతో మహబూబ్ నగర్, నాందేడ్, ఔరంగాబాద్ నగరాల్లో కూడా ఇదే తరహా ఉద్యమాలు చెలరేగాయి.

జాతీయ నాయకుల మద్దతు
మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ వంటి జాతీయ నాయకులు ఈ ఉద్యమానికి లేఖల రూపంలో మద్దతు తెలిపారు. ఉద్యమంలో భాగస్వామ్యులైన విద్యార్థులకు ఆశ్రయం కోసం జైన మందిరం ఖాళీగా ఇచ్చారు. భోజనం కోసం వామన్ రావు నాయక్ భవన్ నుండి సహాయం అందింది.

అచ్యుతరెడ్డి కమిటీ
విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఓ కమిటీని నియమించారు. అచ్యుతరెడ్డి ఈ కమిటీకి నాయకత్వం వహించారు. ఈ కమిటీ బెనారస్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సిలర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ చాన్సిలర్ కట్టమంచి రామలింగారెడ్డిలను సంప్రదించి విద్యార్థుల చేర్చుకోమని అభ్యర్ధించారు. అయితే వారు అభ్యర్థనను తిరస్కరించారు.

కేదారనాథ్ పత్రి మద్దతు
నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ కేదారనాథ్ పత్రి, ఆర్ట్స్ విద్యార్థులకు జబల్పూర్ కాలేజీలో, సైన్స్ విద్యార్థులకు నాగ్‌పూర్ కాలేజీలో చేరేలా సాయం చేసారు. ఈ చర్యకు ప్రతిగా ఉస్మానియా యూనివర్సిటీ చాన్సిలర్ అక్బర్ హైదరీ, ఇంటర్ యూనివర్సిటీ కౌన్సిల్‌ను ఆశ్రయించి చర్యలు తీసుకోవాలని చూశారు. దీనికి ప్రతిస్పందనగా కేదారనాథ్ పత్రి “దేశభక్త విద్యార్థులను ఎక్కడ ఏ యూనివర్సిటీ నుండి నిషేధించినా నేను వారిని చేర్చుకుంటాను” అంటూ ధీమాగా ప్రకటన చేశారు.

వందేమాతరం స్టూడెంట్స్ యూనియన్
జూన్ 1939లో నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థులు “వందేమాతరం స్టూడెంట్స్ యూనియన్”ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు కమిటీ ఆఫ్ యాక్షన్ ఏర్పడింది. వరదరాజులు అనే ప్రసిద్ధ న్యాయవాది వరంగల్ నుండి ఉత్సాహంగా విరాళాలు అందించారు. కళోజి నారాయణ రావు కూడా నిధుల సేకరణకు సహకరించారు.

ఈ ఉద్యమంలో రామచంద్రరావు గర్వంగా “వందేమాతరం” అనే నినాదం హక్కుగా వినిపించారు. ఈ కారణంగా ఆయనను “వందేమాతరం రామచంద్రరావు” అని పిలవడం మొదలైంది.

నిజాం ప్రభుత్వం ప్రతిస్పందన
1938 డిసెంబర్ 12న నిజాం ప్రభుత్వం ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను అధికారికంగా నిషేధించింది. వారిలో ముఖ్యంగా పి.వి.నరసింహారావు, ధర్మ భిక్షం, అచ్యుతరెడ్డి, మార్రి చెన్నారెడ్డి, హయగ్రీవాచారి, నూకల రామచంద్రరెడ్డి వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ ఉద్యమాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం బలప్రయోగానికి దిగింది. వందలాది మంది విద్యార్థులను విశ్వవిద్యాలయాల నుండి సస్పెండ్ చేసి, ఇతర విద్యా సంస్థల్లో కూడా వారి ప్రవేశానికి అడ్డంకులు సృష్టించింది..

ఉద్యమపు ముగింపు, దీర్ఘకాల ప్రభావం
కఠిన చర్యలతో నిజాం ప్రభుత్వం 1938 డిసెంబర్ 30 నాటికి ఉద్యమాన్ని అణిచివేసింది. అయినప్పటికీ, ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, తుదకు తమ విద్యను పూర్తిచేసి, భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలకపాత్ర పోషించడంతోపాటు, స్వాతంత్ర్యానంతరం భారతదేశ అభివృద్ధిలో కూడా ముఖ్య భూమిక వహించారు.

ఈ వందేమాతరం ఉద్యమం, విద్యార్థి శక్తి ఎలా దేశ చరిత్రను ప్రభావితం చేయగలదో చూపించిన ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోయింది.


హైదరాబాద్‌ - రాజ్యంలోని వందేమాతరం ఉద్యమం, కేవలం ఒక పాటపట్ల ప్రేమ మాత్రమే కాదు. అంతకు మించి అది స్వేచ్ఛ పట్ల గల ఆకాంక్ష, సమాన హక్కుల కోసం పోరాట స్పూర్తి, మరియు దేశభక్తి అనే భావనల సమ్మేళనం. ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు విద్యా జీవితం త్యాగం చేసినా, తాము నమ్మిన విలువల కోసం వెనుకడుగు వేయలేదు. స్వాతంత్ర్యానంతరం భారత రాజ్యాంగ నిర్మాణం, పాలనలో కీలక పాత్ర పోషించిన వారిలో వారు చాలామంది ఉన్నారు. వందేమాతరం ఉద్యమం అంటే కేవలం గీతాన్ని పాడటం కాదు – అది అసహనాన్ని శాంతియుతంగా వ్యక్తపరచిన చారిత్రక ఘట్టం. ఈ సంఘటన దేశ చరిత్రలో విద్యార్థి శక్తి సామర్థ్యానికి నిలువెత్తు సాక్ష్యం.

Andhra Mahila Sabha and women movements in Nizam state

 Andhra Mahila Sabha and women movements in Nizam state

ప్రశ్న: ఆంధ్ర మహిళా సభ మరియు మహిళా ఉద్యమాలు

పరిచయం

ఆధునిక భారత మహిళా చరిత్రలో ఆంధ్ర మహిళా సభ ప్రత్యేకమైన స్థానం ప్రత్యేకమైంది. ఇది కేవలం ఒక మహిళా వేదిక కాదు, ఒక మార్గదర్శక సంస్థ, ఒక సమాజ మార్పు ఉద్యమం. 1930లో ఆంధ్ర మహాసభ పరిధిలో స్థాపించబడిన ఈ సంస్థ, స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో మహిళల సామాజిక, రాజకీయ మరియు సాంస్కృతిక ఉద్యమానికి శక్తివంతమైన ప్రేరణగా నిలిచింది. మహిళల శిక్షణ, అణచివేతకు వ్యతిరేకత, అసంబద్ద సాంప్రదాయాలను ప్రశ్నించడం వంటి అంశాల్లో ఇది కీలక పాత్ర పోషించింది. స్వాతంత్ర్యానంతరం తెలంగాణ ప్రాంతంలోనూ మహిళా చైతన్యానికి ఇది బలమైన మూలస్తంభంగా నిలిచింది.

ఆవిర్భావం మరియు ప్రారంభ దశలు

ఆంధ్ర మహిళా సభ 1930లో ఆంధ్ర మహాసభలో భాగంగా ఏర్పడింది. ఆంధ్ర మహాసభ స్వాతంత్ర్య ఉద్యమానికి, సమాజ హితానికి కట్టుబడి పని చేస్తూ మహిళా అభ్యున్నతికి ప్రత్యేక వేదిక అవసరమని గుర్తించి, ఈ మహిళా సభను స్థాపించింది. ఆ సమయంలో మహిళలు పరదా, బాల్య వివాహం, దేవదాసి వ్యవస్థలచే బంధించబడి బాధింపబడుతుండగా, ఈ వేదిక వారికి స్వరం ఇచ్చింది. గృహసీమకు మాత్రమే పరిమితమయ్యే మహిళలు ఈ వేదిక ద్వారా తమ సమస్యలను బహిరంగంగా చర్చించగలిగారు.

నాయకత్వం మరియు ప్రధాన కార్యకర్తలు

ఎంతోమంది ధైర్యవంతులూ, చైతన్యవంతులూ అయన మహిళలు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. నడింపల్లి సుందరమ్మ, టంగుటూరి వరలక్ష్మమ్మ, మాడపాటి మాణిక్యాంబ, బూర్గుల అనంత లక్ష్మీదేవి, పులిజాల కమలాబాయి వంటి వారు మహిళా చైతన్యంలో గొప్ప దిశానిర్దేశకులుగా నిలిచారు. వారు తమ వ్యక్తిగత జీవితాలను ఉద్యమానికి అంకితం చేశారు. వితంతు వివాహాన్ని ధైర్యంగా అంగీకరించిన వరలక్ష్మమ్మ సమాజంలోని పురాతన భావజాలానికి ధీటుగా నిలిచిన ఒక గొప్ప ఉదాహరణ.

ఆంధ్ర మహాసభతో అనుసంధానం

ఆంధ్ర మహిళా సభ, ఆంధ్ర మహాసభ వేదికల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తూ, ఒకే దిశగా పోరాడింది. మహిళల సమస్యలు సమాజ హితంలో భాగంగా చర్చించబడ్డాయి. నిజాం ప్రభుత్వానికి మెమోరాండంలు పంపడం, చట్ట సవరణలకు తీర్మానాలు చేయడం ద్వారా సభ తన ప్రాముఖ్యతను చాటింది. మహిళల సమస్యలు స్వతంత్ర ఉద్యమానికి అనుబంధంగా గుర్తించబడ్డాయి.

ముఖ్య సమావేశాలు మరియు చారిత్రక తీర్మానాలు

1930 జోగిపేట సమావేశం ఈ ఉద్యమానికి తొలి బలమైన వేదికను ఇచ్చింది. 1931 దేవరకొండలో జరిగిన సమావేశంలో టంగుటూరి వరలక్ష్మమ్మ పరదా విధానాన్ని వ్యతిరేకించి మాట్లాడారు. 1934 ఖమ్మంలో యెల్లాప్రగడ సీతాకుమారి ఆధ్యక్షతన జరిగిన సమావేశంలో బాల్య వివాహాలపై తీర్మానాలు ఆమోదించబడ్డాయి. 1935 సిరిసిల్ల లో సమావేశంలో మహిళా సంక్షేమంపై దృష్టి సారించబడింది. 1937 నిజామాబాద్ సమావేశంలో నిజాం రాజాస్థాన ఫర్మానా ద్వారా వితంతు వివాహాలకు అనుమతి రావడం మహిళా ఉద్యమం చరిత్రలో ఘనమైన విజయంగా నిలిచింది. 1940 చిల్కూరు సమావేశంలో పులిజాల కమలాబాయి నాయకత్వంలోని మహిళలు పురుషాధిపత్యాన్ని ధీటుగా ఎదుర్కొని "మా అవసరాలను మేమే నిర్ణయించుకుంటాం" అన్న నినాదం ద్వారా ఉద్యమానికి ఒక బలమైన నినాదాన్ని అందించారు.

సంఘంలో మార్పు తీసుకువచ్చిన ఉద్యమం

ఈ ఉద్యమం క్రమంగా సామాజిక సమస్యల నుండి రాజకీయ ఉద్యమంగా విస్తరించడమే కాకుండా, చట్ట పరంగా మార్పులకు దోహదపడింది. నిజాం ప్రభుత్వానికి నేరుగా విజ్ఞప్తులు చేయడం ద్వారా మహిళల విద్య, ఆస్తి హక్కులు, మరియు మత ఆధారిత అణచివేతలపై చట్ట సవరణలు పొందేందుకు ప్రేరణగా మారింది. మహిళల ఆత్మగౌరవం మరియు స్వీయ హక్కులపై చైతన్యం పెంచడానికి ఈ సంస్థ బలమైన వేదికగా నిలిచింది.

ఆంధ్ర మహిళా సభ – మద్రాసు నుండి హైదరాబాద్‌కు విస్తరణ

డాక్టర్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ 1937లో మద్రాసులో ఆంధ్ర మహిళా సభను ప్రారంభించారు. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి పొందిన అనుభవంతో ఆమెకు మహిళల సమస్యలపై లోతైన అవగాహన ఏర్పడింది. ప్రారంభ దశలోనే ఆమె మహిళల విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబనను లక్ష్యంగా పెట్టుకుని పలు కార్యక్రమాలు ప్రారంభించారు. వనితా మాహా విద్యాలయం ద్వారా మహిళా విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. 1948లో హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనం అయిన తరువాత, ఆమె ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా సభ హైదరాబాద్ శాఖను ప్రారంభించారు.

హైదరాబాద్ శాఖ సేవల విస్తరణ

హైదరాబాద్ శాఖ ద్వారా పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ప్రాథమిక విద్యా కేంద్రాలు, గర్భిణీ సదుపాయాలు, నర్సింగ్ కోర్సులు, వసతి గృహాలు మొదలైనవి ఇందులో ఉన్నాయి. ఈ సేవలన్నీ గ్రామీణ ప్రాంతాల మహిళలకు పట్టణాలలో ఉన్న అవకాశాలను అందించాయి. విద్యార్థినులు, అనాథ బాలికలు, వితంతువులు ఇలా అనేక మహిళలు ఈ కేంద్రాల ద్వారా మానవోన్నతిని పొందారు.

హైదరాబాద్ శాఖ ద్వారా:

ప్రాథమిక పాఠశాలలు, నర్సింగ్ కోర్సులు, గర్భిణీ సదుపాయ కేంద్రాలు, విద్యార్థిని వసతి గృహాలు ప్రారంభించబడ్డాయి.

7. ప్రముఖ ప్రాజెక్టులు మరియు విస్తరణ

వసతి గృహాలు:  ఆంధ్ర మహిళా సభ ఆధ్వర్యంలో నడుపబడిన హోస్టళ్ళు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థినులకు హైదరాబాద్ వంటి నగరాల్లో చదువుకోడానికి అద్భుతమైన అవకాశాన్ని కల్పించాయి. గవర్నమెంట్ సహకారంతో కూడిన సంక్షేమ విధానాలకు ఆదర్శంగా నిలిచాయి.

ఆరోగ్య కేంద్రాలు: ప్రసూతి పీడిత మహిళలకు చౌకగా, విశ్వసనీయ వైద్యం, తల్లిదండ్రులు లేకుండా పెరిగే బాలికలకు స్వయం నిబద్ధతపై శిక్షణ, కుటుంబ నియంత్రణపై ప్రచార కార్యక్రమాలు వంటివాటిపై దృష్ఠిసారించారు.

చట్టబద్ధ ఉద్యమంగా పరిణామం

మహిళలకు హక్కులు చట్టబద్ధంగా పొందేందుకు ఆంధ్ర మహిళా సభ కీలకంగా వ్యవహరించింది. వితంతు వివాహాలపై నిషేధం లేని ఫర్మానాలు, వర్ణాంతర సంబంధాల పిల్లలకు వారసత్వ హక్కులు కల్పించే తీర్మానాలు దీని ఆధ్వర్యంలో జరగడం చారిత్రక ఘటనలు. ఇది ఒక చట్టపరమైన ఉద్యమంగా, మహిళల శక్తిని న్యాయ ప్రాతిపదికన సమాజంలో ప్రతిష్ఠించాలన్న ఆశయాన్ని నెరవేర్చింది.

సాంస్కృతిక విప్లవంలో భూమిక

ఈ ఉద్యమం సాంస్కృతిక రంగానికీ విస్తరించి గ్రామీణ మహిళల్లో చైతన్యం పెంచేందుకు బుర్రకథలు, నాటకాలు, పాటల ద్వారా ప్రచారం చేపట్టింది. మాడపాటి మానిక్యాంబ, టంగుటూరి వరలక్ష్మమ్మ లాంటి రచయితలు సాహిత్యాన్ని ఆయుధంగా మలిచి సమాజాన్ని చైతన్యం వైపు నడిపించారు. గ్రామీణ సమాజాన్ని కూడా ఉద్యమం చైతన్యం చేసింది.

విద్యా సంస్థలు:
విద్యా సంస్థ పేరు - స్థాపిత సంవత్సరం - విశేషాలు
1940 లో వనితా మహా విధ్యాలయ ను మద్రాసులో ప్రారంభించారు. మొదట ఇది కళాశాలగా ప్రారంభం అయింది. 1958 లో ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల హైదరాబాదులో ప్రారంభించబడింది. దీనికి విశ్వవిధ్యాలయ UGC గుర్తింపు ఉంది.
1960 లో ఇన్స్టిట్టూట్ ఆఫ్ మెడికల్ సోషల్ వర్క్ వైద్య సామాజిక సేవలో శిక్షణ కోసం స్దాపించబడింది.
1971  లో ‘కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ విమెన్’ అనే పేరుతో మహిళల కోసం ప్రత్యేక బి.ఎడ్ కళాశాల స్దాపించబడింది.

దేశవ్యాప్తంగా గుర్తింపు

ఈ సంస్థ సేవలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. జవహర్‌లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు, రాధాకృష్ణన్ లాంటి నాయకులు సభ సేవలను ప్రశంసించారు. UNESCO వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి గుర్తింపు లభించింది. ఆ సంస్థకు చెందిన విద్యార్థినులలో ఎందరో వైద్యులు, ఉపాధ్యాయులు, IAS అధికారులుగా ఎదిగారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగడానికి ఇది దోహదపడింది.

వారసత్వం మరియు ప్రభావం

ఆంధ్ర మహిళా సభ ద్వారా ఏర్పడిన చైతన్యం తరం తరానికి మార్గదర్శిగా నిలిచింది. గ్రామీణ స్థాయిలోనూ మహిళలలో చట్టబద్ధతపై అవగాహన పెరిగింది. ఇది ఒక ప్రాంతీయ ఉద్యమంగా ప్రారంభమై, జాతీయ మహిళా చైతన్యంలో ఒక విశిష్టమైన అధ్యాయంగా నిలిచింది. సాంప్రదాయాలకు వ్యతిరేకంగా నిలిచి, మహిళల స్వేచ్ఛకు మార్గం వేసిన ఉద్యమంగా ఇది నిలిచింది.

ముగింపు

ఆంధ్ర మహిళా సభ అనేది కేవలం సేవా కార్యక్రమాల పరిమితికి లోబడిన సంస్థ కాదు. ఇది సమాజ మార్పు కోసం పోరాడిన మహిళా చైతన్య ఉద్యమం. ఇది తెలుగు మహిళల ఆత్మగౌరవానికి, విద్యాభివృద్ధికి, హక్కుల సాధనకు మార్గదర్శిగా నిలిచింది. అనేక విభాగాలలో దీని విజయాలు కనిపిస్తున్నా, అసలు గమ్యం – సమానత్వం, స్వావలంబన – కోసం పోరాటం కొనసాగుతూనే ఉంది. ఈ ఉద్యమం ఒక చరిత్ర కాదు, ఒక జీవన తత్వం – ఎందుకంటే ఇది మహిళలు తమ జీవితాలను తాము నిర్మించుకోవాలన్న ఆశయాన్ని నమ్మింది, పోరాడింది, ఆ కలను నిజం చేసింది.

Library movement in Hyderabad princely state

Library movement in Hyderabad princely state 

ప్రశ్న: హైదరాబాద్ రాష్ట్రంలో లైబ్రరీ ఉద్యమం: చైతన్య దీప్తి నుండి చలనం వరకు

పరిచయం

20వ శతాబ్ద ప్రారంభంలో భారతదేశం సాంస్కృతిక మరియు రాజకీయంగా మహత్తర మార్పుల నడుమలో ఉన్న సమయం. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం — ముఖ్యంగా తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతం — ఫ్యూడలిజం, విద్యా లోపం, భాషాపరమైన తీవ్రంగా నిర్లక్ష్యానికి లోనై ఉండేది. ఈ పరిస్థితుల్లో వెలుగులోకి వచ్చిన లైబ్రరీ ఉద్యమం, తెలుగు ప్రజలలో ఒక మేధో చైతన్యాన్ని రేకెత్తించి, భాష, సంస్కృతి, సమాజం, రాజకీయం అన్నింటినీ ప్రభావితం చేసింది.

1. ఉద్యమ ఆరంభ దశ: తెలుగు భాషపై ప్రేమకు సంకేతం

1890ల నాటికే తెలుగు భాషా పరిరక్షణపై చర్చలు మొదలయ్యాయి. కాని, 1901లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం స్థాపనతో ఈ ఆలోచనలు కార్యరూపం దాల్చాయి. ఈ సంస్థ స్థాపనలో కోమర్రాజు లక్ష్మణరావు, రవిచెట్టు రంగారావు, బుర్రా సుబ్బారావు వంటి విద్యావేత్తలు కీలక పాత్ర వహించారు.

ఈ గ్రంథాలయ నేడు భవిష్యత్ భావోద్వేగాలకు బీజం వేసింది. తెలుగు భాషలో సాహిత్య ప్రచురణలు, గ్రంథాల సేకరణ, చర్చల వేదికగా ఇది మారింది. నిజాం ప్రభుత్వ విద్యా విధానంలో తెలుగు భాషకు ప్రాధాన్యం లేకపోవడం, ఆ భాషను జీవంతో ఉంచాలన్న ఉద్దేశంతోనే ఇది సాగింది.

గ్రంథాలయాల విస్తరణ: ప్రతి పట్టణం చైతన్య కేంద్రంగా మారింది

ఆంధ్రభాషా నిలయం విజయంతో ప్రేరణ పొందిన ప్రాంతీయ మేధావులు హన్మకొండలో శ్రీ రాజరాజనరేంద్ర ఆంధ్రభాషా నిలయం ను 1904 లో స్థాపించారు. అనంతరం ఆంధ్రసంవర్ధిని గ్రంథాలయాన్ని 1905 లో సికింద్రాబాద్ – లో, విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి ని 1908 లో హనుమకొండ లో స్ధాపించారు.

విజ్ఞాన చంద్రిక సంస్థ, విజ్ఞాన ప్రచారాన్ని ప్రోత్సహిస్తూ, ఆధునిక శాస్త్ర విజ్ఞానంపై పుస్తకాలను అందించటం ద్వారా యువతలో పరిశోధనా ఆసక్తిని పెంచింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో సామాజిక శాస్త్రాలు, చరిత్ర, తత్వశాస్త్రం వంటి విభాగాల్లో రచనలు వెలువడ్డాయి.

3. ప్రముఖుల పాత్ర: ఉద్యమం ముందుకు నడిపించిన శక్తులు

వట్టికోట ఆళ్వారస్వామి — ఆయన ఉద్యమాన్ని ప్రజల మధ్య తీసుకెళ్లడంలో ముఖ్యపాత్ర వహించారు. పల్లెల్లో తిరిగి పుస్తకాలు సేకరించి వాటిని హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీకు అందించారు. ఆయన ప్రారంభించిన ఆంధ్ర గ్రంథమాల ద్వారా తెలుగులో చారిత్రక రచనలు ప్రచురించబడ్డాయి.

కొమర్రాజు వెంకటలక్ష్మణరావు — తెలుగు సాహిత్య చరిత్రను అధ్యయనం చేసి, పుస్తకరూపంలో అందించిన వారు. ఆయన వ్యాసాలు, రచనలు విద్యా మేధావులకు ప్రేరణగా నిలిచాయి.

పాటిబండ్ల సత్యనారాయణశాస్త్రి — లైబ్రరీ ఉద్యమంలో అనేక వకృత్వ సభలను నిర్వహించారు. యువతలో చదువుపట్ల ఆసక్తిని పెంచారు.

విద్యా సంస్కృతి వికాసం: లైబ్రరీలు ఒక పాఠశాలలుగా మారిన సందర్భం

లైబ్రరీలు కేవలం పుస్తకాలు ఉంచే కేంద్రాలు కాదు. అవి ప్రజల ఆలోచనలకు ఉత్తేజం ఇచ్చే వేదికలుగా మారాయి. తెలుగు భాషలో అనువాదాలు, ప్రవచనాలు, వచన రచనలు పెరిగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సాధారణ పాఠకులు ఈ కేంద్రాల ద్వారా ప్రేరణ పొందారు.

కొన్ని లైబ్రరీలు ప్రత్యేకంగా తెలుగు పరీక్షలు నిర్వహించేవి. ఇవి ప్రామాణికత కలిగిన పరీక్షలుగా పరిగణించబడ్డాయి. ఈ ప్రయోగాలు, విద్యా రంగానికే కాదు, భాషా పరిశోధనకు బాటలు వేసాయి.

సామాజిక రాజకీయ అనుసంధానాలు: జాగ్రత్తగా ముందుకు వచ్చిన చలనం

లైబ్రరీలు సాంస్కృతిక ఉత్సవాలతో పాటు చర్చా వేదికలుగా మారాయి. జమీందారీ వ్యవస్థ, కుల వివక్ష, నిజాం పాలనలో దోపిడీ వంటి అంశాలపై ప్రజలు చర్చలు జరిపారు. రాజకీయ భావజాలం మరింత విస్తరించింది.

పుస్తకాల రూపంలో గాంధీ, టాగోర్, జవహర్లాల్ నెహ్రూ రచనలు ప్రజలకు చేరాయి. వీటి ద్వారా స్వాతంత్ర్య యోచన, సమానత్వ భావనలు గ్రామస్థాయికి దిగివచ్చాయి. ఈ ఉద్యమం ద్వారా Telangana ప్రాంత ప్రజల్లో ప్రజాస్వామ్య చైతన్యం పెరిగింది.

స్వాతంత్ర్య పోరాటానికి మద్దతు

లైబ్రరీల్లో రూపొందిన ఆలోచనా వాతావరణం స్వాతంత్ర్య ఉద్యమానికి బలాన్ని ఇచ్చింది. అనేక యువకులు, చదువుకున్న పాఠకులు స్వాతంత్ర్య పోరాటంలో భాగమయ్యారు. రచయితలుగా, కార్యకర్తలుగా, ఉపాధ్యాయులుగా మారి తమ పరిధిలో చైతన్యం వ్యాప్తి చేశారు.

వారసత్వం: ఉద్యమం వలన ఏర్పడిన మార్పులు

తెలుగు భాష ప్రాథమిక విద్యా మాధ్యమంగా నిలిచింది.

అనేక మండల కేంద్రాల్లో పబ్లిక్ లైబ్రరీలు స్థాపించబడ్డాయి.

విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధన, గ్రంథాల పరిశీలనలకు పునాది పడింది.

సాహిత్య సంస్కృతిని ఉధృతం చేసిన పాఠకులు, రచయితలు, ప్రచురణకర్తలు కలిగారు.

ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిపాలనా బోర్డు వంటి సంస్థలు ఏర్పాటయ్యాయి.

మిగిలిన ముఖ్య లైబ్రరీలు (ప్రస్తావనీయమైనవి)

లైబ్రరీ పేరు

స్థాపిత సంవత్సరం

స్థలం

విశేషాలు

శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం

1901

హైదరాబాద్

మొదటి తెలుగు లైబ్రరీ

రాజరాజనరేంద్ర భాషా నిలయం

1904

హన్మకొండ

ప్రముఖ రచయితలు చర్చించిన వేదిక

ఆంధ్రసంవర్ధిని గ్రంథాలయం

1905

సికింద్రాబాద్

పాఠశాల విద్యార్థుల ఆదరణ పొందినది

విజ్ఞాన చంద్రిక

1908

హనుమకొండ

శాస్త్రీయ సాహిత్య ప్రచారం

అబిడ్స్ లైబ్రరీ

1910

హైదరాబాద్

పెద్ద ప్రజా గ్రంథాలయం, నేటికీ చురుకుగా ఉంది

ముఖ్యమైన లైబ్రరీల ప్రస్థానం

  1. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం (1901, హైదరాబాద్):
    ఇది హైదరాబాద్ రాష్ట్రంలో తొలి తెలుగు లైబ్రరీగా స్థాపించబడింది. కమరాజు లక్ష్మణరావు, రవిచెట్టు రంగారావుల సహకారంతో ఏర్పడిన ఈ నిలయం, తెలుగు భాష, సాహిత్యంపై ప్రజల్లో ఆసక్తిని పెంపొందించింది. విద్యార్థులు, పండితులు, సామాన్యులు అందరూ ఇక్కడ గ్రంథాలను చదివేందుకు వచ్చేవారు.
  2. రాజరాజనరేంద్ర భాషా నిలయం (1904, హన్మకొండ):
    ఈ లైబ్రరీ పేరుగాంచిన రచయితలు, పండితుల చర్చలకు వేదికగా నిలిచింది. హన్మకొండ ప్రాంతంలో సాహిత్య సమావేశాలు, పాఠకుల సంభాషణలు జరుగుతుండటంతో ఇది చైతన్య కేంద్రంగా మారింది.
  3. ఆంధ్రసంవర్ధిని గ్రంథాలయం (1905, సికింద్రాబాద్):
    ఈ గ్రంథాలయం ప్రధానంగా పాఠశాల విద్యార్థుల ఆదరణ పొందింది. విద్యాభ్యాసానికి అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచి, యువతలో చదువు పట్ల ఆసక్తిని పెంచింది.
  4. విజ్ఞాన చంద్రిక (1908, హనుమకొండ):
    విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి శాస్త్రీయ సాహిత్యాన్ని ప్రచారం చేయడానికి ఏర్పడింది. చరిత్ర, విజ్ఞానం, తత్వశాస్త్రం వంటి రంగాలలో రచనలు చేయడం, వాటిని చదవడం ద్వారా తార్కిక ఆలోచనకు పురోగమనం కలిగింది.
  5. అబిడ్స్ లైబ్రరీ (1910, హైదరాబాద్):
    ఇది ఒక పెద్ద ప్రజా గ్రంథాలయంగా ఏర్పడింది. నేటికీ చురుకుగా పనిచేస్తున్న ఈ లైబ్రరీ వేలాదిమంది పాఠకులకు సేవలు అందిస్తుంది. ఇది చదువుపై ప్రజలలో నిలకడైన మక్కువను కలిగించడంలో ముఖ్యపాత్ర వహించింది.

లైబ్రరీ ఉద్యమం తెలుగు ప్రాంతీయ చైతన్యంలో ఒక మలుపు తిప్పింది. భాషా పరిరక్షణ, సమాజ శుద్ధి, విద్యా విస్తరణ, రాజకీయ చైతన్యం అన్నింటిలోనూ కీలక మార్గదర్శకంగా నిలిచింది. ఇది ఒక "ఓదార్పు కేంద్రం" మాత్రమే కాకుండా, ప్రజల ఆలోచనలను సంస్కరించిన "ఒక జ్ఞాన ఉద్యమం"గా నిలిచింది. ఈ గ్రంథాలయాల ద్వారా తెలుగు ప్రజల్లో భాషా గౌరవం, జ్ఞానాభిలాష పెరిగాయి. ప్రజలు తాము చదివిన గ్రంథాల ద్వారా దేశభక్తి, స్వాతంత్ర్య భావాలు, సామాజిక న్యాయం వంటి అంశాల పట్ల అవగాహన పెంచుకున్నారు. ఈ చైతన్యం ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమం, హక్కుల సాధన కోసం చేసే ఉద్యమాల్లో భాగస్వాములయ్యేలా చేసింది.

Library movement in Nizam state 

UGC JRF NET Paper 1 mock test 1 in English

UGC JRF NET Paper 1 mock test 1 in English UGC JRF NET Paper 1 mock test 1 in English UGC JRF NET Paper 1 ...